ఇంత టాలెంట్ ఉందనుకోలేదు: విలియమ్సన్

11 May, 2017 18:54 IST|Sakshi
ఇంత టాలెంట్ ఉందనుకోలేదు: విలియమ్సన్

ముంబై: ఐపీఎల్-10 సీజన్లో లోకల్ టాలెంట్ వెలుగులోకి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని న్యూజిలాండ్ కెప్టెన్, సన్ రైజర్స్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ఇండియన్ యువ ఆటగాళ్ల టాలెంట్ అధ్భుతమని, ఇక్కడి యువ ఆటగాళ్లలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదని, ఇక్కడికి వచ్చి వారితో నెట్స్ లో ప్రాక్టీస్ చేశాక అర్ధమైందని విలియమ్సన్ తెలిపాడు. అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆడక ముందే బంతిని సునాయసంగా బౌండరీలకు తరలిస్తున్నారని విలియమ్సన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

సన్ రైజర్స్ యువ బౌలర్లు సిద్దార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్ అధ్భుతంగా రాణిస్తున్నారని, జట్టులో దీపక్ హుడా కూడా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాడని విలియమ్స్ కొనియాడాడు. ఇక ఢిల్లీ టాప్ ఆర్డర్ లోని యువ బ్యాట్స్ మెన్ ల ఆటను ఆసక్తికరంగా చూస్తున్నానని విలియమ్సన్ పేర్కొన్నాడు. పుణే ఆటగాడు రాహుల్ త్రిపాఠి అసాధారణ ప్రతిభతో రాణిస్తున్నాడని యువ ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తాడు. ఐపీఎల్ తో భారత్ యువ ఆటగాళ్లతో స్నేహం పెరిగిందని, ఇది ప్రపంచ క్రికెట్ కు మంచిదని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. 2017 అంతర్జాతీయ ఉత్తమ బ్యాట్స్ మెన్ అయిన విలియమ్సన్ ను సన్ రైజర్స్ కొన్నిమ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం చేసినా విలియమ్సన్ అడ్డు చెప్పలేదు. గత ముంబై మ్యాచ్ లో విలియమ్సన్ స్థానంలో అప్ఘాన్ స్పిన్నర్ మహ్మద్ నబీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు