రంగారెడ్డికి టీమ్ టైటిల్

9 Dec, 2013 02:03 IST|Sakshi
రంగారెడ్డికి టీమ్ టైటిల్

సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సబ్ జూని యర్, జూనియర్ అక్వాటిక్స్ పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు టీమ్ టైటిల్ సొంతం చేసుకుంది. విజయవాడలో జరిగిన ఈ పోటీల్లో రంగారెడ్డి జిల్లా స్విమ్మర్లు 19 అంశాల్లో అగ్రస్థానంలో నిలిచారు. ముఖ్య ఫలితాలు ఇలా ఉన్నాయి.
 గ్రూప్-1 బాలికలు: 100 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. ఆత్మిక కృష్ణన్ (రంగారెడ్డి-1ని:15.64 సెకన్లు), 2. సాయిశ్రీ (కృష్ణా), 3. అలేఖ్య (కరీంనగర్). 50 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. ఆత్మిక కృష్ణన్ (రంగారెడ్డి-32.01 సెకన్లు), 2. సాయిశ్రీ (కృష్ణా), 3. మేఘాంజలి (తూర్పు గోదావరి). 200 మీటర్ల బటర్‌ఫ్లయ్: 1. యు.శ్రేష్ట (రంగారెడ్డి-3ని:50.56 సెకన్లు), 2. శ్రీ రమ్య (పశ్చిమ గోదావరి). 1500 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. యు.శ్రేష్ట (రంగారెడ్డి-25ని:03.07 సెకన్లు), 2. కె.ఎస్.భవ్య (హైదరాబాద్).
 గ్రూప్-2 బాలుర 800 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. నాగసాయి (రంగారెడ్డి-11ని:05.62 సెకన్లు), 2. గురుహంత్ సాయి (హైదరాబాద్), 3. తేజస్విన్ (ఖమ్మం), తారకరామ్ (రంగారెడ్డి). 50 మీటర్ల బటర్‌ఫ్లయ్: 1. మొహిత్ రాజ్ (రంగారెడ్డి-30.15 సెకన్లు), 2. గౌతమ్ సూర్య (రంగారెడ్డి), 3. మునిశేఖర్ (కడప). 100 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. గురుహంత్ సాయి (హైదరాబాద్-1ని:12.99 సెకన్లు), 2. శివ సాకేత్ (నిజామాబాద్), 3. సాయి లక్ష్మణ్ (రంగారెడ్డి), సాయి కుమార్ (విశాఖపట్నం).

మరిన్ని వార్తలు