భారత్‌ స్వర్ణాల వేట మొదలైంది..

13 Apr, 2018 08:54 IST|Sakshi
తేజస్విని(ఎడమ), అంజుమ్‌(కుడి)

గోల్డ్‌కోస్ట్‌, క్వీన్స్‌లాండ్‌ : 21వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో తొమ్మిదో రోజు భారత్‌ స్వర్ణం, రజతంతో పతకాల ఖాతాను తెరచింది. 50 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఈవెంట్లో భారత మహిళా షూటర్లు తేజస్విని సావంత్‌ స్వర్ణానికి గురి పెట్టగా, అంజుమ్‌ రెండు పాయింట్ల తేడాతో రజతం పతకం సాధించారు.

తేజస్విని 457.9 పాయింట్లతో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో రికార్డు సాధించి పసిడిని గెలిచారు. కాగా, రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్లో తేజస్విని ఇప్పటికే రజతం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ గేమ్స్‌లో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 33కు చేరింది. ఇందులో 15 స్వర్ణాలు ఉన్నాయి.

రెజ్లింగ్‌, షూటింగ్‌, బాక్సింగ్‌, జావెలిన్‌ త్రో, టేబుల్‌ టెన్నిస్‌, 400 మీటర్ల రిలే తదితర ఈవెంట్ల పలువురు భారతీయ ఆటగాళ్లు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు