మళ్లీ వెంకటేశ్వర్‌రెడ్డికే పగ్గాలు

7 Nov, 2019 10:09 IST|Sakshi

రెండోసారి శాట్స్‌ చైర్మన్‌గా నియామకం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మన్‌గా  అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి కొనసాగనున్నారు. ఎల్బీ స్టేడియం లోని తన చాంబర్‌లో బుధవారం ఉదయం రెండోసారి చైర్మన్‌గా వెంకటేశ్వర్‌ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం శాట్స్‌ తొలి చైర్మన్‌గా పీఠమెక్కిన ఆయన ఇటీవలే తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు.

అయితే రెండో దఫా కూడా పగ్గాలు ఆయన చేతికే దక్కడం విశేషం. ఈ అవకాశాన్ని ఇచి్చన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శాట్స్‌ చైర్మన్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు తన శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శాట్స్‌ ఎండీ దినకర్‌ బాబు, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, అంతర్జాతీయ బాక్సర్‌ నిజాముద్దీన్, జిమ్నాస్ట్‌ అరుణా రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు