‘దాదా’ రికార్డు బద్దలుకొట్టిన కోహ్లీ

29 Jul, 2017 20:53 IST|Sakshi
‘దాదా’ రికార్డు బద్దలుకొట్టిన కోహ్లీ

లక్ష్మణ్‌, వెంగ్ సర్కార్ సరసన కోహ్లీ
గాలే: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు గాలేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సెంచరీల రికార్డును బద్దలుకొట్టాడు. గాలే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి 133 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ కెరీర్ లో ఇది 17వ శతకం కాగా, గంగూలీ పేరిట ఉన్న 16 టెస్టు సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు.

దాంతో పాటుగా 17 టెస్టు శతకాలు సాధించిన కోహ్లీ.. హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ (17), దిలీప్‌ వెంగ్‌ సర్కార్‌ (17)ల సరసన నిలిచాడు. శతకాల రికార్డులో కోహ్లీకి సమీప లక్ష్యంలో మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ (22), సెహ్వాగ్ (23) ముందున్నారు. భారత్ నుంచి సచిన్ టెండూల్కర్ (51), మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ (36), సునీల్ గవాస్కర్ (34) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ సుదీర్థకాలం తన ఫామ్‌ను కొనసాగిస్తే మరిన్ని రికార్డులు తిరగరాయడం సాధ్యమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు