విరాట్ కోహ్లి 'చెత్త' రికార్డు!

30 Jan, 2017 10:14 IST|Sakshi
విరాట్ కోహ్లి 'చెత్త' రికార్డు!

నాగ్పూర్:టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. మూడు టీ-20 మ్యాచ్ ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో కోహ్లి 21 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో టీ-20ల్లో ఇంగ్లండ్ పై చెత్త రికార్డు అప్రథను మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకూ ఇంగ్లండ్ పై ఎనిమిది ట్వంటీ 20ల్లో విరాట్ నమోదు చేసిన సగటు 29.25. పొట్టి ఫార్మాట్ ఇది విరాట్ చెత్త ప్రదర్శనగా నమోదైంది.

మిగతా ఏ అంతర్జాతీయ జట్టుపై కూడా టీ-20ల్లో కోహ్లి ఇంతటి ఘోర ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్ పై అతడు ఆడిన ఎనిమిది టీ- 20ల్లో 20కిపైగా పరుగుల్ని ఆరుసార్లు సాధించాడు. దాంతో విరాట్ అత్యంత చెత్త యావరేజ్ ను ఇంగ్లండ్ పై నమోదు చేసినట్లయ్యింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. ఓపెనర్ గా దిగిన విరాట్ ఆదిలో మెరిపించినప్పటికీ, భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు.

మరిన్ని వార్తలు