పాకిస్థాన్తో ఓటమిని ఎప్పడూ ఊహించం

1 Nov, 2016 18:58 IST|Sakshi
పాకిస్థాన్తో ఓటమిని ఎప్పడూ ఊహించం

న్యూఢిల్లీ: ఆసియా ఛాంపియన్స్ హాకీ టోర్మమెంట్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై విజయం సాధించడం చాలా ప్రత్యేకమైనదని భారత హాకీ జట్టు సీనియర్ ఆటగాడు సర్ధార్ సింగ్ అన్నాడు. పాక్తో ఎప్పుడు ఆడినా చావోబతుకో లాంటి పరిస్థితి ఉంటుందని, ఒత్తిడి అధిగమించడం గురించి జూనియర్ ఆటగాళ్లకు చెప్పామని తెలిపాడు. పాకిస్థాన్తో ఫ్రెండ్లీ మ్యాచ్లలో కూడా ఓడిపోవాలని భావించమని చెప్పాడు.

క్వాంటాన్ (మలేసియా)లో జరిగిన ఫైనల్లో భారత్ 3-2 స్కోరుతో పాక్ను మట్టికరిపించి ట్రోఫీ సాధించిన సంగతి తెలిసిందే. భారత జట్టు మంగళవారం ఢిల్లీకి వచ్చింది. ఆసియా ఛాంపియన్స్ హాకీ టోర్నీలో భారత్ విజేతగా నిలవడమిది రెండోసారి. తాజా టోర్నీలో భారత్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. లీగ్ దశలో పాక్ను ఓడించిన భారత్.. ఫైనల్లోనూ పాక్కు షాకిచ్చింది.

>
మరిన్ని వార్తలు