ఇలాంటి ఇంజనీర్ పెళ్లికూతుర్ని చూశారా? | Sakshi
Sakshi News home page

ఇలాంటి ఇంజనీర్ పెళ్లికూతుర్ని చూశారా?

Published Tue, Nov 1 2016 6:41 PM

ఇలాంటి ఇంజనీర్ పెళ్లికూతుర్ని చూశారా?

పెళ్లికూతురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయితే ఆమె ఎలా ఉంటుందని ఊహిస్తాం? వందరకాలుగా ఆలోచించండి.. ఇలాంటి ఇంజనీర్ పెళ్లికూతుర్ని మాత్రం మీరు చూసి ఉండరు. ఎందుకంటే ఈమె 'ప్రపంచంలోనే బలవంతురాలైన పెళ్లికూతురు' మరి!

డొరేన్ ఫూ అనే ఈ మహిళ తైవాన్ లోని కోహియాంగ్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. చిన్నప్పటినుంచి చదువులకు మాత్రమే పరిమితమైన డొరేన్.. చూస్తూచూస్తూనే లావెక్కిపోయింది. మూడేళ్ల కిందట ఉద్యోగంలో చేరేనాటికి డ్రమ్ములా ఉండేది. ఒకానొక సందర్భంలో 'ఇక తగ్గాల్సిందే'నని నిర్ణయించుకుని జిమ్ బాటపట్టింది..

మూడేళ్లు తిరిగేసరికి డొరేన్ అద్భుతమైన శరీరాకృతిని సాధించింది. జిమ్ లో ఆమెతోపాటే వ్యాయామానికి వచ్చే యువడితో పరిచయం ప్రేమగా మారింది. ఇటీవలే వివాహబంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. పెళ్లికూతురి అలంకరణలో వివాహ వేదికకు వచ్చిన డొరేన్.. పుల్అప్స్ కొట్టి అదరగొట్టింది. డొరేన్ ను 'వరల్డ్ స్ట్రాంగెస్ట్ బ్రైడ్'గా అభివర్ణిస్తూ వార్తాపత్రికలు కథనాలు రాశాయి. ఆ గౌరవాన్ని వినయంగా స్వీకరిస్తూ.. వ్యాయామం పట్ల అవగాహన పెంచడానికే పెళ్లి డ్రెస్ లో ఫీట్ చేశానని చెప్పిందామె. వీలైనంతమేరలో ప్రతిఒక్కరూ వ్యాయామం చేయాలని కోరింది.


Advertisement
Advertisement