వెయిట్‌లిఫ్టింగ్‌లోనూ తప్పని నిరాశ

7 Aug, 2016 12:50 IST|Sakshi
వెయిట్‌లిఫ్టింగ్‌లోనూ తప్పని నిరాశ

రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్లో భాగంగా తొలిరోజు  తొమ్మిది పతకాలకు గాను మూడు ఈవెంట్లలో పాల్గొన్న భారత ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో జీతూరాయ్, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అపూర్వ చండీలా, అయోనికా పాల్ నిరాశపరచగా, మహిళల వెయిట్లిఫ్టింగ్లో మిరాబాయ్ చానూ సైతం ఆకట్టుకోలేకపోయింది.

 

భారతకాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన వెయిట్లిప్టింగ్ 48 కేజీల కేటగిరీలో మిరాబాయ్ స్నాచ్ విభాగంలో 82 కేజీలను ఎత్తడంలో విఫలమైంది. దీంతో క్లీన్ అండ్ జర్క్కు అర్హత సాధించలేక భారత అభిమానులు పతకంపై పెట్టుకున్న ఆశలను నిరాశపరిచింది.  వెయిట్ లిఫ్టింగ్ పోరులో థాయ్లాండ్కు చెందిన సోపితా తనాసన్ స్వర్ణ పతకం సాధించగా, ఇండోనేషియాకు చెందిన ఆగస్టియానికి రజతం సొంతం చేసుకుంది. జపాన్ క్రీడాకారిణి మియాకి కాంస్య పతకం దక్కింది.

ఇక వెయిట్ లిఫ్టింగ్లో సతీష్ శివలింగం భారత్కు మిగిలిన ఆశాకిరణం. ఆగస్టు 10వ తేదీన 77 కేజీల కేటగిరీలో సతీష్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
 

మరిన్ని వార్తలు