పాకిస్తాన్‌లో విండీస్ పర్యటన?

14 Apr, 2016 00:59 IST|Sakshi

 సిరీస్‌పై పీసీబీ ఆశాభావం

కరాచీ: గత ఏడేళ్లుగా పాకిస్తాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు పెద్ద జట్లను ఒప్పించడంలో విఫలమైన పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. తాజాగా దీనిపై పీసీబీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇరు జట్ల మధ్య వచ్చే సెప్టెంబర్‌లో యూఏఈలో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.

ఇందులో కొన్ని మ్యాచ్‌లను పాకిస్తాన్‌లోనే ఆడితే బాగుంటుందని విండీస్‌కు పాక్ విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై విండీస్ దిగ్గజాలు రిచర్డ్స్, లారా తమ బోర్డును ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ దేశంలో ఆడితే విండీస్ క్రికెటర్లకు ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించేందుకు కూడా పీసీబీ సిద్ధమైంది.  2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి తర్వాత ఆ దేశంలో మరే పెద్ద జట్టు అడుగు పెట్టలేదు.

>
మరిన్ని వార్తలు