భారత్ ‘పసిడి గురి’

26 Aug, 2013 02:07 IST|Sakshi
భారత్ ‘పసిడి గురి’
 వ్రోక్లా (పోలాండ్): భారత మహిళా ఆర్చర్లు అద్భుతం చేశారు. ప్రపంచ కప్‌లో వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేశారు. ఆదివారం జరిగిన టీమ్ రికర్వ్ విభాగంలో ఫైనల్లో దీపిక కుమారి, రిమిల్, బొంబేలా దేవిలతో కూడిన భారత బృందం 219-215తో ప్రపంచ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ చాంపియన్ దక్షిణ కొరియాను బోల్తా కొట్టించింది.
 
  గత నెలలో కొలంబియాలో జరిగిన ప్రపంచ కప్‌లోనూ టీమిండియాకు బంగారు పతకం లభించింది. ఆరు బాణాల చొప్పున తొలి మూడు రౌండ్‌లు పూర్తయ్యాక భారత్, కొరియా 163-163 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. చివరి రౌండ్‌లో కొరియా ఆర్చర్లు వరుసగా 6, 10, 9, 9, 8, 10... భారత ఆర్చర్లు వరుసగా 9, 10, 10, 10, 10, 7 పాయింట్లు నమోదు చేశారు. దాంతో భారత్ నాలుగు పాయింట్ల తేడాతో నెగ్గింది. 
 
మరిన్ని వార్తలు