రంగు పడిన ప్రపంచకప్

2 Feb, 2015 09:17 IST|Sakshi
రంగు పడిన ప్రపంచకప్

అప్పటిదాకా తెలుపు రంగు దుస్తులకే పరిమితమైన క్రికెటర్లు రంగురంగుల దుస్తులతో మెరిసిన తొలి ప్రపంచకప్. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆడిన మొదటి వరల్డ్‌కప్ కూడా ఇదే (1992). ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ కలర్‌ఫుల్ ఈవెంట్‌లో దక్షిణాఫ్రికా అరంగేట్రం చేసింది. గత టోర్నీకి కాస్త భిన్నంగా ఈ టోర్నీ మ్యాచ్‌లు జరిగాయి. రెండు గ్రూపులుగా కాకుండా తొమ్మిది జట్లు ఒకే గ్రూపుగా రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడ్డాయి.

లీగ్ దశలో సాధించిన విజయాలు, పొందిన పాయింట్ల ఆధారంగా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత పొందాయి. పోటీపడిన తొలి వరల్డ్‌కప్‌లోనే దక్షిణాఫ్రికా సెమీస్ చేరింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన పాకిస్థాన్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. పాక్ కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్ ఆల్‌రౌండ్ నైపుణ్యం, జట్టును నడిపించిన తీరు అద్భుతం. భారత జట్టు కేవలం రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి లీగ్ దశలోనే నిష్ర్కమించింది.
 
ఆతిథ్యం: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్; వేదికలు: 18; పాల్గొన్న జట్లు: భారత్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే.

>
మరిన్ని వార్తలు