విజృంభించిన శివ: ఆజాద్ సీసీ గెలుపు

9 Aug, 2016 11:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వై. శివ (6/23) విజృంభించడంతో ఆజాద్ సీసీ 8 వికెట్ల తేడాతో సెయింట్ మేరీస్‌పై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన సెయింట్ మేరీస్ 33.2 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. శివ ధాటికి ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. తర్వాత ఆజాద్ సీసీ 13.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 83 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. హుస్సేన్ 42, ఇస్మాయిల్ 33 పరుగులు చేశారు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు:   అభినవ్ కోల్ట్స్: 264 (సుందర్ 50, అజ్మత్ అలీ 72; తరుణ్ 6/33), లాల్‌బహదూర్ పీజీ: 124 (తరుణ్ 74; సాయిప్రసాద్ 4/46, అషీర్ 5/42).
   రెడ్‌హిల్స్: 249/8 (అద్నాన్ 88, జాఫర్ 43; గుల్షన్ 3/51, రాజశేఖర్ 3/51). తిరుమల సీసీ: 128/6 (రిత్విక్ 41).
   హెచ్‌సీఏ అకాడమీ: 318/9 (సాత్విక్ రెడ్డి 89, సత్య 55, శ్రీనివాస్ రావు 44), విజయ్ సీసీ: 159/9 (శృతీశ్ రెడ్డి 3/23).
   అమీర్‌పేట్ సీసీ: 236/8 (గుర్విందర్ సింగ్ 103, భార్గవ్ రెడ్డి 64; అవినాశ్ 5/35), స్టార్లెట్స్ సీసీ: 164 (సృజన్ 33; నైరుత్ రెడ్డి 3/36, సుశీల్ 3/29).
   ఆర్‌జేసీసీ: 128 (కరణ్ 4/22), ఎంపీ స్పోర్టింగ్: 130/6 (రాజశేఖర్ 30; శ్రీధర్ 3/24).
   టీమ్‌కున్: 185 (సహస్ర 61, విఘ్నేశ్వర్ 52; ఫజల్ 3/10), ఎల్‌ఎన్‌సీసీ: 186/8 (గంగాధర్ 66, ఓబుల్ రెడ్డి 36).
   యాదవ్ డెయిరీ: 163/9 (ప్రణవ్ 51 నాటౌట్; అఖిలేశ్ 4/37), తారకరామ: 169/5 (నవీన్ కుమార్ 63).
   మయూర్ సీసీ: 196/6 (విరించి యాదవ్ 85), ఎస్‌కే బ్లూస్: 143 (యాకుబ్ 53; గోవర్ధన్ 5/30).
   యంగ్‌మాస్టర్స్: 177/8 (విశాల్ 44), డెక్కన్ కోల్ట్స్: 134 (నరేంద్ర 39; రిచి 4/28, ప్రఫుల్ 3/21).

>
మరిన్ని వార్తలు