యశ్వంత్, కీర్తనలకు స్వర్ణాలు

23 Oct, 2016 12:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో యశ్వంత్, కీర్తన పసిడి పతకాలతో మెరిశారు.రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఆర్‌ఆర్‌ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ రోలర్ స్కేటింగ్ ట్రాక్‌పై శనివారం జరిగిన అండర్-17 బాలుర ఫైనల్లో కె. యశ్వంత్ పసిడి పతకాన్ని దక్కించుకోగా... బి. రోహిత్, జాన్ సత్య వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. బాలికల విభాగంలో బి. కీర్తన, కోమిలక తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అండర్-14 బాలుర విభాగంలో పి. శివరామ్ అగ్రస్థానంలో నిలవగా... కె. జతిన్, అనిరుధ్ రెండు, మూడు స్థానాల్ని సంపాదించారు. బాలికల విభాగంలో చరితాదేవి, సుశ్రుత, విధి వరుసగా తొలి మూడు స్థానాల్ని దక్కించుకున్నారు.   

 

మరిన్ని వార్తలు