వ్యవసాయం, నీటిపారుదలతో తెలంగాణ అభివృద్ధి : విద్యాసాగర్‌రావు

29 Jun, 2014 01:05 IST|Sakshi

 భువనగిరి : తెలంగాణ పునర్నిర్మాణానికి నీటిపారుదల,వ్యవసాయ రంగాల అభివృద్ధి ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక రహదారి బంగ్లాలో విలేకరులతో మాట్లాడారు. నదీజలాల విషయంలో సీమాంధ్రుల కుట్రల ఫలితంగా తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో కేసీఆర్ నాయకత్వంలో కేంద్ర జల సంఘంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి లాభం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. ఇందుకోసం చిన్న నీటి వనరులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఎత్తిపోతల ద్వారా చెరువులు, కుంటల్లో సాగు నీటిని నింపడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తితెస్తామన్నారు.  ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, చందుపట్ల వెంకటేశ్వర్‌రావు ఉన్నారు.
 5
 

మరిన్ని వార్తలు