ఇంటర్నెట్‌ కలిపింది ఇద్దరిని..

3 Aug, 2018 09:48 IST|Sakshi

ఒక్కటైన తమిళ యువతి, అరబ్‌ యువకుడు

అన్నానగర్‌: ఇంటర్నెట్‌ ద్వారా పరిచయమైన కడలూరు ఉపాధ్యాయురాలిని అరబ్‌ దేశానికి చెందిన పారిశ్రామికవేత్త గురువారం హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. కడలూరుకి చెందిన గుణశేఖరన్‌ కుమార్తె చారులత (32). ఇంజినీర్‌ పట్టభద్రురాలైన ఈమెకు ఇంటర్నెట్‌ చాటింగ్‌ ద్వారా మూడేళ్ల కిందట అరబ్‌ దేశానికి చెందిన థామస్‌లూకాస్‌ రోహన్‌ స్నేహితుడిగా పరిచయం అయ్యాడు. రెండేళ్ల కిందట చారులత తన స్నేహితుడిని ఇంటికి పిలిచింది. థామస్‌లూకాస్‌ కడలూరు వచ్చి పలు స్థలాలు సందర్శించి తన దేశానికి తిరిగి వెళ్లాడు.

కొన్ని నెలల తరువాత చారులత అరబ్‌ దేశానికి వెళ్లింది. ఆ దేశంలో ఆమెకు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం దొరికింది. దీని తరువాత స్నేహితులు, ప్రేమికులుగా మారారు. గత మార్చి 23న అరబ్‌ దేశంలో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. తరువాత వారు హిందూ సంప్రదాయం ప్రకారం తమిళనాడులో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం థామస్‌ లూకాస్‌ రోహన్, చారులత వీరితో సహా నలుగురు కడలూరు వచ్చారు. వీరికి విరుదాచలం కొళంజియప్పర్‌ ఆలయంలో గురువారం ఉదయం 10.30 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.

>
మరిన్ని వార్తలు