వర్సిటీ అక్రమాల్లో నలుగురి అరెస్ట్

10 Aug, 2015 02:16 IST|Sakshi
వర్సిటీ అక్రమాల్లో నలుగురి అరెస్ట్

బెంగళూరు(బనశంకరి) : రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన మరో నలుగురిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీసీబీ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ వెల్లడించారు. పట్టుబడిన వారిలో బెంగళూరులోని ముత్యాలనగర్‌కు చెందిన భగీరథ్ సింగ్, జ్ఞానజ్యోతి నగర్‌కు చెందిన దేవేంద్రగౌడ పాటిల్, విశ్రాంత అసిస్టెంట్ రిజిస్ట్రార్, బాగల్‌కోటె జిల్లా బాదామి తాలూకా వీరపురకేశి ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల క్యాంపస్ నివాసి డాక్టర్ శంకరగౌడ, మూల్యాంకనం విభాగం సీనియర్ అసిస్టెంట్, గిరినగర నివాసి జయమాదేగౌడ ఉన్నారు. 2014 జూన్ 21 గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరీక్షల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్నారు. 

మూల్యాం కనం వైస్ ఛాన్సలర్ సిండికేట్ సభ్యుడైన డాక్టర్ రాజేశ్‌శ్ణై సెలక్ట్ సభ్యుడైన డాక్టర్ ఎంకే.రమేశ్, డాక్టర్ కిరణ్‌కుమార్ నేతృత్వంలో సమితి నిర్వహించిన విచారణ లో అక్రమాలు వెలుగు చూశాయి. దీనికి సంబంధించి తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2014 సంవత్సరం పరీక్షల్లో ఎంవీజే కాలేజీ డాక్టర్ పాండిరాజ్, డాక్టర్ పునీత్‌పాల్‌సింగ్‌ఓబరాయ్, విజయపుర ఆల్‌ఆమీన్ మెడికల్ కాలేజీకి చెందిన సయ్యద్‌అబ్దూల్ ఖాదర్‌భాంగి, సురేశ్‌కన్నమాడి, రాయచూరు నవోదయ మె డికల్ కాలేజీ డాక్టర్ శివరాజ్ అనంత్‌రెడ్డి, కలబురిగికి చెందిన ఎంఆర్.మెడికల్ కాలేజీ డాక్టర్ బసవేశ్, డాక్టర్ శరణబసప్ప, బెంగళూరు కిమ్స్ కాలేజీ డాక్టర్ గురుప్రీత్‌సింగ్ చాకో, దావణగెరె జేజేఎం మెడికల్ కాలేజీ కునాల్‌సిన్హా, దక్షిణకన్నడ సూళ్యద కేవీజే మెడికల్ కాలేజీ డాక్టర్ అనిందితరాయ్ అనే 10 మంది వైద్య పీజీ విద్యార్ధులకు సంబందించి 32 సమాధాన పత్రాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ధ్రువీకరించారు. పరీక్షల్లో అక్రమాలకు పా ల్పడిన ఆర్‌జీయూహెచ్‌ఎస్ సిబ్బంది ధనుంజయ్, మైసూరు మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ సహాయక వి.శ్రీదర్‌ను ఎనిమిది నెలల క్రితమే సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.

జయమాదేగౌడ దినకూలీల నౌకరుల సహాయంతో భగీరథసింగ్  విశ్వవిద్యాలయం నుంచి ఒక సెట్ ను రూ.10 వేలతో ఖాళీ జవాబుపత్రాలతో పరీక్షకు ముందే కొనుగోలు చేసి విద్యార్ధుల నుంచి సమాధానాలు  రాసిన అనంతరం విద్యార్ధులతో సమాదానపత్రాలను సేకరించిన దేవేంద్రగౌడపాటిల్, డాక్టర్ శంకర్‌గౌడ, జయమాదేగౌడపాటిల్‌తో కుమ్మక్కై  మూ ల్యాంకనంకు పంపినప్పుడు  విద్యార్ధులకు అధికమార్కులు వేయడానికి సహకరించినట్లు విచారణలో తెలి సింది. ఈ అక్రమానికి యుజీ విద్యార్ధులు ఒకరు నుంచి రూ.2 లక్షలు,  పీజీ కి రూ.2లక్షల 50 వేల వరకు డ బ్బులు తీసుకున్నట్లు వెలుగు చూసింది. ఈ కేసులో  ఇం కా అనేకమంది హస్తం ఉన్నట్లు సమాచారం ఉందని సాక్ష్యాల ఆధారంగా వారిని అరెస్ట్ చేస్తామని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు