మైక్రోసాప్ట్ కొత్త ల్యాప్ టాప్, ధరెంతంటే..

3 May, 2017 15:46 IST|Sakshi
మైక్రోసాప్ట్ కొత్త ల్యాప్ టాప్, ధరెంతంటే..
క్లాస్ రూమ్ విద్యార్థుల కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన విండోస్ 10 ఎస్ ను మైక్రోసాప్ట్ ఆవిష్కరించింది. ఈ విండోస్ 10 ఎస్ కూడిన మైక్రోసాప్ట్ సర్ ఫేస్ ల్యాప్ టాప్ నూ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ డివైజ్ ధర 999 డాలర్లు అంటే సుమారు 64,090 రూపాయలు. మే 2 నుంచి కంపెనీ ఈ డివైజ్ ప్రీ-ఆర్డర్లను ప్రారంభించనుంది. జూన్ 15 నుంచి మైక్రోసాప్ట్ సర్ ఫేస్ ల్యాప్ టాప్ లను డెలివరీ చేస్తామని కంపెనీ ప్రకటించింది. బుర్గుండి, కోబాల్ట్ బ్లూ, గ్రే, ప్లాటినం రంగుల్లో ఈ ల్యాప్ టాప్ అందుబాటులో ఉండనుంది. దీని బరువు 2.76 పౌండ్లు కాగ, 14.5ఎంఎం కంటే తక్కువ మందాన్నే  ఇది కలిగి ఉంది. మార్కెట్లో ఉన్న మ్యాక్ బుక్ ఎయిర్ లేదా ప్రోలకంటే ఈ ల్యాప్ టాప్ చాలా పలుచగా, తేలికగా ఉండనుందని కంపెనీ చెబుతోంది. వాటి కంటే ఎక్కువ వేగవంతంగా కూడా పనిచేయనుందట. ఆపిల్ మ్యాక్ బుక్ ప్రొడక్ట్ లకంటే  ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉందని మైక్రోసాప్ట్ వెల్లడించింది. 
 
మైక్రోసాప్ట్ సర్ ఫేస్ ల్యాప్ టాప్ ఫీచర్లు..
13.5 అంగుళాల డయోగ్నల్ పిక్సెల్ సెన్స్ డిస్ ప్లే
థిన్నెస్ట్ ఎల్సీడీ టచ్ మోడ్యుల్
మెటల్ బాడీ,  ఆల్ట్రా స్లిమ్ బాడీ
ఇంటెల్ కోర్ ఐ5, ఐ7 ప్రాసెసర్స్
కోర్ ఐ5 వెర్షన్ కు 4జీబీ ర్యామ్, 128 జీబీ వరకు ఎస్ఎస్డీ స్టోరేజ్
14.5 గంటల బ్యాటరీ లైఫ్
 
Read latest Technology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు