మోటో కొత్త ఫోన్లు.. వీటి హైలెట్‌ అదే!

2 Aug, 2017 13:16 IST|Sakshi
మోటో కొత్త ఫోన్లు.. వీటి హైలెట్‌ అదే!
లెనోవో ఎట్టకేలకు మోటో జీ5ఎస్‌, మోటో జీ5ఎస్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 'ఎస్‌' పేరుతో ఈ స్పెషల్‌ ఎడిషన్‌ను మొబైళ్లను కంపెనీ తీసుకొచ్చింది. ముందస్తు మోడల్స్‌ మోటో జీ5, మోటో జీ5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లకు పలు అప్‌గ్రేడ్లను చేసిన లెనోవో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. ఈ నెల నుంచే వివిధ దేశాల్లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు అమ్మకానికి వస్తున్నాయి. వీటి ధర 249 యూరోలు(సుమారు రూ.18,900), 299 యూరోలు(రూ.22,700) నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.
 
వీటి ఆకర్షణీయమైన ఫీచర్‌ కెమెరా డెవలప్‌మెంట్‌. మోటో జీ5ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ 16 మెగాపిక్సెల్‌తో ప్రైమరీ రియర్‌ కెమెరాను, 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను కలిగి ఉంటే, మోటో జీ5ఎస్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపే రెండు కెమెరాలను కలిగి ఉంది. ఈ రెండు 13 మెగాపిక్సెల్‌ సెన్సార్‌తో వస్తున్నాయి. ముందు వైపు వైండాగిల్‌ లెన్స్‌, ఎల్‌ఈడీ ఫ్లాష్‌ సపోర్టుతో 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాతో ఈ ఫోన్‌ రూపొందింది. మరో ప్రత్యేక ఫీచర్‌ ఆల్‌-మెటల్‌ యునిబాడీ డిజైన్‌.
 
మోటో జీ5ఎస్‌ ఫీచర్లు...
ఆండ్రాయిడ్‌ 7.1 నోగట్‌ 
5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఎస్‌ఓసీ
3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
128జీబీ వరకు విస్తరణ మెమరీ
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ
4జీ ఎల్టీఈ కనెక్టివిటీ, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌
 
మోటో జీ5ఎస్‌ ప్లస్‌ ఫీచర్లు...
ఆండ్రాయిడ్‌ 7.1 నోగట్‌
5.5 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ డిస్‌ప్లే
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌
4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
128జీబీ వరకు విస్తరణ మెమరీ
4జీ ఎల్టీఈ కనెక్టివిటీ
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 
>
మరిన్ని వార్తలు