రేవంత్ 'కోడ్' లాంగ్వేజ్ పై ఏసీబీ ఆరా

7 Jun, 2015 13:08 IST|Sakshi
రేవంత్ 'కోడ్' లాంగ్వేజ్ పై ఏసీబీ ఆరా

హైదరాబాద్: టీడీపీ ఓటుకు నోటు వ్యవహారంలో ఒక్కొక్కటిగా సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రేవంత్ రెడ్డి భారీగా మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తోంది. హవాలా డబ్బుకు సంబంధించి 'కోడ్' లాంగ్వేజ్లో రేవంత్ మాట్లాడారని తెలుసుకున్న ఏసీబీ దీనిపై ఆరా తీస్తోంది.

అంతే కాకుండా అనేక ఆర్థిక అక్రమాల్లో రేవంత్ మధ్యవర్తిగా కూడా వ్యవహరించినట్టు సమాచారం. ఇటువంటి పనులు అనేకం రేవంత్ రెడ్డితో 'బాస్' చేయించారని ఏసీబీ విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. కాగా, ఓటుకు నోటు వ్యవహారంలో రెండో రోజూ రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు