గుడుంబాకు బానిసై వ్యక్తి మృతి

15 Aug, 2015 21:35 IST|Sakshi

కరీంనగర్: సుల్తానాబాద్ మండలంలోని సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన గోపిశెట్టి చందు(35) అనే వ్యక్తి శనివారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం గుడుంబాకు బానిసై అతిగా సేవిస్తూ అనారోగ్యం బారిన పడడంతో కరీంనగర్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతిచెందినట్లు తెలిపారు. గుడుంబాను అరికట్టకుంటే గ్రామంలో మరింత మంది చనిపోయే ప్రమాదం ఉందని సర్పంచ్ పసెడ్ల స్వరూప తెలిపారు.

వెంటనే ఎక్సైజ్ అధికారులు, పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు చేసి గుడుంబాను అరికట్టాలని కోరారు. మృతునికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మరిన్ని వార్తలు