టీచర్ల బదిలీల ఉత్తర్వులకు సవరణ!

24 Jun, 2015 00:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీల ఉత్తర్వులకు సవరణ లు చేయాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు పీఆర్‌టీయూ వెల్లడిం చింది. మంగళవారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హేతుబద్ధీకరణ, బదిలీల నిబంధనల్లో మార్పులపై అధికారులతో చర్చిం చారు. ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 30 లోపు విద్యార్థులుంటే ఒక టీచర్ ను ఇవ్వాలన్న నిబంధనను మార్చాలని నిర్ణయించారు. 1 నుంచి 19 విద్యార్థులున్న స్కూళ్లకు ఒక టీచర్‌ను, 20 నుంచి 60 మంది వరకున్న స్కూళ్లకు ఇద్దరు టీచర్లను ఇవ్వాలని నిర్ణయించారు.
 
పదో తరగతిలో 25 శాతం కంటే తక్కువ ఫలితాలు వచ్చిన స్కూళ్లకు చెందిన టీచర్లు, ప్రధానోపాధ్యాయులను బదిలీ చేయాలనే నిబంధనను మార్పు చేయాలన్న డిమాండ్‌పైనా సానుకూలత వ్యక్తం చేశారని, ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయని పీఆర్‌టీయూ తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు బదిలీలు చేసేలా ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు, మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్టీయూ నేతలు రాజిరెడ్డి, భుజంగరావు కోరారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు, పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు