దేశ ఆర్థిక వ్యవస్థలో ఏపీ వాటాను పెంచుతాం

20 Dec, 2019 03:11 IST|Sakshi

భారత్‌ అమెరికా రక్షణ సంబంధాల సదస్సులో ఏపీ మంత్రి గౌతంరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : భారత ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ వాటాను రానున్న రెండే ళ్లలో మూడింతలు పెంచడ మే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఎనిమిది రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉందన్నారు. హైదరాబాద్‌లో రెండు రోజులుగా జరుగుతున్న భారత్, అమెరికా రక్షణ సంబంధాల అంతర్జాతీయ సదస్సులో గురువారం ఆయన ప్రసంగించారు.

ఏపీ ఆర్థిక వ్యవస్థను పురోభివృద్ధి బాటలో నడిపేందుకు రూపొందిస్తున్న రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే రంగాలు, అంశాలను గుర్తించినట్టు తెలిపారు. రక్షణ రంగానికి సంబంధించి రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డిఫెన్స్‌ కారిడార్లు కీలక పాత్ర పోషిస్తా యని గుర్తిం చామన్నారు. భారతీయ సైనిక బలగాలు, నౌకదళంతో ఏపీ ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకుందని, రామాయపట్నం పోర్టులో నేవీ బేస్, దొనకొండలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ ఏర్పాటులను గౌతంరెడ్డి ఉదహరించారు. సబ్‌మెరైన్, ఎయిర్‌క్రాఫ్ట్‌ బేస్, ఆఫ్‌షోర్‌ రిజర్వులతో ఇప్పటికే విశాఖ కీలక కేంద్రంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు