అసెంబ్లీ ముగిసేలోపు సర్కార్‌కు నివేదిక

14 Mar, 2017 02:20 IST|Sakshi
అసెంబ్లీ ముగిసేలోపు సర్కార్‌కు నివేదిక

పేద ముస్లింల స్థితిగతులపై
అధ్యయనం: బీసీ కమిషన్‌ చైర్మన్‌

సిద్దిపేట జోన్‌: బీసీఇ గ్రూపులో ఉన్న ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు నాలుగు బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాయని బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను అసెంబ్లీ సమావేశాలలోపు ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా చిన్నకో డూరు, సిద్దిపేట, దుద్దెడ, ఎర్రవల్లి ప్రాంతాల్లో పేద ముస్లింల జీవన, ఆర్థిక స్థితిగతులను పరిశీలించారు. అనంతరం సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు.

ఇప్పటికీ ఎస్సీ, బీసీల కన్నా ముస్లింలు వెనుకబడి ఉన్నారని తెలిపారు. ముస్లింలు పేదరికంలో, బయటకు చెప్పుకోలేని మూగ జీవా లుగా బతుకుతున్నారన్నారు. ఇప్పుడున్న 4శాతం రిజర్వే షన్‌ను 12శాతానికి పెంచాలా? విద్య, ఉపాధి, ఇతర రంగాల్లో వారు ఏంకోరుకుంటున్నారో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు చైర్మన్‌ తెలిపారు. సొంత వ్యాపారానికి బ్యాంక్‌ రుణాలు అందజేయాలని,గృహాలు మంజూరు చేయాలని వారు కోరుకుంటున్నారన్నారు.

మరిన్ని వార్తలు