సిరికొండలో బీడీ కార్మికుల ర్యాలీ

16 Feb, 2016 17:01 IST|Sakshi

నిజామాబాద్ : బీడీ కట్టలపై గొంతు క్యాన్సర్ గుర్తు పరిమాణాన్నితగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ సిరికొండ మండల కేంద్రంలో మంగళవారం ఆందోళనకు దిగింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని నినదిస్తూ బీడీ కార్మికులు ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిప్యూటి తహశీల్దార్ విక్రమ్‌కు వినతి పత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు