తేనెటీగల దాడిలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి మృతి

19 Nov, 2014 02:01 IST|Sakshi

జైనథ్: తేనెటీగల దాడిలో ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో ఎంఏ హమీద్‌ఖాన్ (53) టెలిఫోన్ మెకానిక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సంవత్సరకాలంగా కార్యాలయం పైకప్పుకు బయటి భాగం నుంచి తేనెటీగలు తుట్టెలను ఏర్పర్చుకున్నాయి.

మంగళవారం విధులకు హాజరైన హమీద్ ఖాన్ మధ్యాహ్న సమయంలో భోజనం ముగించుకుని కార్యాలయంలో సేద తీరుతుండగా తేనెటీగలు దాడి చేశాయి. పక్కనే ఉన్న ఎంపీడీవో, తహసీల్దార్, సొసైటీ కార్యాలయాల వైపు కూడా తేనెటీగలు విజృంభించాయి. తీవ్రంగా గాయపడిన హమీద్‌ఖాన్ అక్కడికక్కడే చనిపోయారు.

మరిన్ని వార్తలు