కేజీబీవీల్లో కళాశాల విద్య

11 Jun, 2018 00:50 IST|Sakshi

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కళాశాల విద్యను ప్రారంభిస్తామ న్న ప్రభుత్వ హామీ కార్యరూపం దాల్చింది. రాష్ట్రంలో 94 కేజీబీవీల్లో కళాశాల విద్యను అం దించడానికి అనుమతి లభించగా వీటిలో ప్రస్తు తం 84 కళాశాలలను ప్రారంభిస్తున్నారు.

ఈ మేరకు సమగ్ర శిక్షాభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ టి.విజయ్‌కుమార్‌ సంబంధిత జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరో పది కళాశాలలు ప్రారంభించడానికి అవకాశం ఉన్నా.. వసతులు లేకపోవడంతో వాటిని ప్రారంభించట్లేదని తెలుస్తోంది. దీంతో 84 కేజీబీవీల్లో కళాశాల విద్యకోసం ప్రవేశాలకు ఏర్పాట్లు చేశారు.   

13 వరకు దరఖాస్తుల ఆహ్వానం..
కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం ఇంటర్‌ ఫస్టియ ర్‌కు మాత్రమే విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనిలో కొన్ని కళాశాలలకు సైన్స్‌ గ్రూప్‌లను కేటాయించగా.. మరికొన్నింటి లో ఆర్ట్స్‌ గ్రూప్‌లకు అవకాశం కల్పించారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 13లోగా సంబంధిత డీఈవో కార్యాలయంలో సంప్రదించి దర ఖాస్తు చేసుకోవాలని ఉన్నతాధికారులు తెలిపారు.

ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌లలో ఒక్కో గ్రూప్‌కు 40 సీట్లను కేటాయించారు. వీటిని ముందుగా కేజీబీవీల్లో టెన్త్‌ చదివిన విద్యార్థినులకు, అనాథలకు, పేద విద్యార్థులకు ప్రాధా న్యక్రమంలో కేటాయిస్తారు. సీట్లు భర్తీ కాకుంటే మిగతా వారికి అవకాశం ఇస్తారు. కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపక పోస్టులకోసం దరఖాస్తులను ఈ నెల 13 వరకు సంబందిత డీఈవో కార్యాలయాల్లో అందజేయాలని, అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు లో 55% మార్కులతో పీజీ, బీఈడీ పూర్తిచేసి ఉండాలని నిబంధనలు పెట్టారు.

ఎంపికైన అధ్యాపకులకు నెలకు రూ.23 వేల గౌరవ వేతనం అందించనున్నారు. కళాశాలల్లో కోర్సుల ప్రారంభానికి సమగ్ర శిక్షా అభియాన్‌ నుంచి ఆదేశాలందాయని రాజన్న సిరిసిల్ల జిల్లా సెక్టోరల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు