తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

25 Dec, 2017 10:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల నుంచే వివిధ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరగుతున్నాయి. ఆయా చర్చిలలో క్రీస్తు జననం గురించిన విశేషాలను ప్రదర్శించారు. క్రిస్మస్‌ కేక్‌లను కట్‌ చేసి భక్తులకు పంచారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలోని శుభవార్త దేవాలయంలో అర్ధరాత్రి జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఆసియాలోనే అతిపెద్దదైన మెదక్‌లోని సీఎస్‌ఐ చర్చిలోనూ అర్ధరాత్రి నుంచి విశేష ప్రార్థనలు జరుగుతున్నాయి. 


విజయవాడలో...
విజయవాడలోని గుణదల మేరీమాత చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే బి.టి.కాంపౌండ్‌లో గల పురాతన చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్దెత్తున పాల్గొనగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని 112 ఏళ్లనాటి పురాతన సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పుంగనూరు మండలం మర్లపల్లిలోనూ క్రిస‍్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరులోని సెయింట్‌ జోసెఫ్‌, డౌని హాల్‌ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.

>
మరిన్ని వార్తలు