డబుల్‌ వేగం పెంచాలి

9 Jan, 2019 12:12 IST|Sakshi
రాంతీర్థంలో నిర్మాణ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి

పాపన్నపేట(మెదక్‌): మండలంలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని  కలెక్టర్‌ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పాపన్నపేట మండల పరిధిలోని గాజులగూడెం, రాంతీర్థం, బాచారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబుల్‌బెడ్‌రూం నిర్మాణం ప్రారంభించి నెలలు కావస్తున్న ఇంకా బేస్‌మెంట్‌ స్థాయికి కూడా చేరుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాచారంలో నిర్మాణం ఆలస్యం కావడానికి కారణాలను అడుగగా అక్కడ నీటి సమస్య ఉండటం వల్ల నిర్మాణ పనులు కొనసాగడం లేదని ఎంపీపీ పవిత్రదుర్గయ్య తెలిపారు.

పండగలను దృష్టిలో ఉంచుకొని భవన నిర్మాణ కార్మికులు పనిలోకి రాకుండా, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సమస్యలను అధిగమించి పట్టుదలతో డబుల్‌బెడ్‌రూంల నిర్మాణం పూర్తి చేయాలని అదేశించారు. అధికారులు నిరంతరం పనులు పర్యవేక్షిస్తూ.. వెంట వెంటనే తనకు రిపోర్ట్‌ పంపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గాజులగూడెంలో గొల్లకుర్మలు కలెక్టర్‌ను గొంగడితో సన్మానించి, గొర్రెపిల్లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో బాలాగౌడ్, శ్రీనివాస్, దుర్గయ్య, బాబాగౌడ్, ఆంటోని, సాయిరెడ్డి, పీఆర్‌ఈఈ వెరాంతీర్థంలో నిర్మాణ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి 

మరిన్ని వార్తలు