రెండు చేతులతో ఒకేసారి..

30 Oct, 2019 12:48 IST|Sakshi

శ్రీనగర్‌కాలనీ: విద్యార్థులకు రెండు చేతులతో రాయగలిగే స్కిల్‌ నేర్పిస్తే వారిలో ఆత్మవిశ్వాసం, మెదడు పనితీరు మరింత మెరుగవుతుందని క్వీన్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ చైర్మన్‌ రామలింగం తెలిపారు. మంగళవారం వెంకటగిరిలోని క్వీన్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో విద్యార్థులకు రెండు చేతులతో రాసే విధానం(డ్యూయల్‌ హ్యాండ్‌ రైటింగ్‌) ట్రైనింగ్‌ నిర్వహించారు. విద్యార్థులు రెండు చేతులతో చేతిరాతను రాసి తమ మెదడుకు పని చెప్పారు. ఈ విధానం వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరిగి చదువుతో పాటు అన్ని పనుల్లో యాక్టివ్‌గా ఉంటారని రామలింగం తెలిపారు. విద్యార్థులకు మా స్కూల్స్‌ బ్రాంచ్‌లలో ఇటువంటి వినూత్న కార్యక్రమాలను విసృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు