పట్టాదారు పాస్‌ పుస్తకం ఇప్పించండి

12 Jul, 2019 07:35 IST|Sakshi

ఆర్డీవో కార్యాలయం ఎదుట వృద్ధ దంపతుల నిరసన  

వరంగల్‌ రూరల్‌ : పట్టాదారు పాస్‌ పుస్తకం జారీ చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వృద్ధ దంపతులు గురువారం వరంగల్‌ రూరల్‌ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. గుగులోతు దేప్యా, సతీమణి అంజరమ్మ దంపతులకు వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని 561, 562, 563, 658, 659, 660 సర్వే నంబ ర్లలో 9 ఎకరాల సాగు భూమి ఉంది. సన్నూరు వీఆర్‌ఓగా పనిచేస్తున్న డి.వెంకటేశ్వర్లు 2014లో వారికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేయకుండా ఇతరుల పేరుపై జారీ చేశాడు. అప్పటి నుంచి దంపతులు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించు కోవడంలేదు. విసిగిపోయిన బాధితులు ‘సన్నూ రు వీఆర్‌వో బి.వెంకటేశ్వర్లు మా భూమి మాకు కాకుండా చేస్తున్నాడు. మా వయసు 75 సంవత్సరాలు. మేం రాయపర్తి ఎంఆర్‌వో కార్యాలయం చుట్టూ తిరగలేం. వీఆర్‌ఎపై చర్య తీసుకుని మా భూమి మాకు ఇప్పించాలని’ఫ్లెక్సీపై రాసి ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రదర్శించారు.  

వారం రోజుల్లో న్యాయం చేస్తాం: ఆర్డీవో
వృద్ధ దంపతుల సమస్యపై ఆర్డీవో సీహెచ్‌.మహేందర్‌జీ స్పందించారు. వారం రోజుల్లో దంపతులకు పట్టాదారు పాస్‌ పుస్తకం జారీ చేయిం చడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే సన్నూరు వీఆర్‌వో వెంకటేశ్వర్లుపై చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు