విద్యుత్‌షాక్‌తో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి

27 May, 2015 17:56 IST|Sakshi

నిజామాబాద్: ప్రమాదవశాత్తూ ట్రాన్‌ఫార్మర్‌పై ఎక్కిమరమ్మతులు చేస్తున్న గంగాధర్(38) అనే వ్యక్తి కరెంటు షాక్ తగిలి మృతిచెందాడు. ఈ ఘటన వేల్పూరు మండలం పచ్చలనడికుడలో చోటుచేసుకుంది. గంగాధర్ స్థానికంగా ఎలక్ట్రిషియన్ పనులు చేస్తుంటాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గంగాధర్ మృతిచెందాడని కుటుంబసభ్యులు, తోటి గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
(వేల్పూర్)
 

మరిన్ని వార్తలు