రేపు సెట్స్ తేదీలు ప్రకటిస్తాం

4 Jan, 2015 01:19 IST|Sakshi
రేపు సెట్స్ తేదీలు ప్రకటిస్తాం

తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీల ప్రకటనను సోమవారాని(5వ తేదీ)కి వాయిదా వేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మ న్ పాపిరెడ్డి తెలిపారు. గవర్నర్ నరసింహన్ ఎంసెట్ అంశంపైనే ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసినందున.. ఆయనపై ఉన్న గౌరవంతో తేదీల ప్రకటనను వాయిదా వేసినట్లు చెప్పారు. శనివారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, విద్యామండలి కార్యదర్శి వికాస్‌రాజ్, చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు మల్లేశ్, వెంకటాచలం, కార్యదర్శి శ్రీనివాసరావు, సాంకేతిక విద్యా కమిషనర్ అనిల్‌కుమార్, వివిధ వర్సిటీల వీసీలతో సమావేశం జరిగింది. అనంతరం పాపిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎంసెట్‌తోపాటు ఇతర సెట్స్ తేదీలపై సమావేశంలో చర్చించినట్లు తెలి పారు. అయితే గవర్నర్ భేటీ నేపథ్యంలో ఆయనపై గౌరవంతో తేదీలను ప్రకటించడం లేదని, ఈ నెల 5వ తేదీన ప్రకటిస్తామని పాపిరెడ్డి వెల్లడించారు. అయితే ఎంసెట్‌ను తొలుత మే 3న నిర్వహించాలనుకున్నా.. దానిని మే 17న నిర్వహిస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చినట్లు తెలి సింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివిధ సెట్స్ తేదీలు ఇలా ఉండే అవకాశం ఉంది.. వీటిల్లో మార్పులు ఉండొచ్చు..
 
 సెట్స్ జరిగే అవకాశమున్న తేదీలు
 
 తేదీ      సెట్     నిర్వహణ సంస్థ
 మే 17    ఎంసెట్     జేఎన్‌టీయూహెచ్
 మే 6    ఐసెట్     కాకతీయ వర్సిటీ
 మే 24    ఎడ్‌సెట్     ఓయూ
 మే 14    ఈసెట్    ----
 మే 30    పీజీఈసెట్    ----
 మే 27     లాసెట్, పీజీలాసెట్    -----
 మే 20     పీఈసెట్    -----
 

>
మరిన్ని వార్తలు