పీజీ కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన

13 Nov, 2018 12:46 IST|Sakshi

గద్వాల అర్బన్‌: పీజీ కళాశాల ఎదుట సోమవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడారు. పీజీ ఇంగ్లిష్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నా.. వారి అభిప్రాయం తీసుకోకుండా ఇంగ్లిష్‌ విభాగం ఎత్తివేయడం దుర్మార్గమన్నారు. అర్ధంతరంగా ఇంగ్లిష్‌ విభాగం ఎత్తివేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించడం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమేనన్నారు.

ఈ రోజు సెమిస్టర్‌ ఫీజులు చెల్లించేందుకు చివరి రోజైనా కళాశాలకు ప్రిన్సిపాల్, స్టాప్‌ రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై నాలుగు రోజుల క్రితం పాలమూరు వీసీని కలిసినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో సంవత్సరం మధ్యలో కోర్స్‌ ఎత్తివేస్తామంటే ఎక్కడికి వెళ్లాలని ఆక్రోశించారు.

వివాహం అయిన మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందన్నారు. ప్రైవేటు పీజీ కళాశాలలను ప్రోత్సహించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రయత్రిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా పాలమూరు వీసీ, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు అవినాష్, భరణికుమార్, అనూష, పార్వతి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు