సింగూరు పారేనా.. సిరులు పండేనా

20 Jul, 2014 23:52 IST|Sakshi
సింగూరు పారేనా.. సిరులు పండేనా

జోగిపేట: సాగునీటికోసం అల్లాడిపోతున్న మెతుకుసీమ రైతులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సింగూరు జలాలు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నాయి. 40 వేల ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యంతో చేపట్టిన పనులకు గ్రహణం పట్టడంతో గతంలో నిర్మించిన కాల్వలు శిథిలమయ్యాయి. ప్రత్యేక రాష్ట్రంలోనైనా సింగూరు జలం పారితే సిరులు పండించాలని రైతులంతా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
 
 కొన సా...గుతున్న పనులు
 ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటించిన వైఎస్ రాజశేఖరరెడ్డి మె తుకుసీమ రైతాంగం దుస్థితి చూసి చలించిపోయారు. సాగు నీటికోసం వారు పడుతున్న ఇబ్బందులు చూసి ఎంత ఖర్చయినా సరే సింగూరు జలాలను సేద్యానికి అందిస్తామని హామీ ఇచ్చారు.
 
 సింగూరు జలం పారితే 40 వేల ఎకరాలు పచ్చగా ఉంటాయని తెలుసుకుని, 2004లో అధికార పగ్గాలు చేపట్టగానే సింగూరు కాల్వల నిర్మాణానికి, భూములు కోల్పోతున్న రైతులకు పరిహారానికి రూ.89.98 కోట్లు మంజూరు చేశారు. అనంతరం 2006లో ముఖ్యమంత్రి హోదాలో ఈ పనులకు శంకుస్థాపనలు కూడా చేశారు. అనంతర కాలంలో నిధులు విడుదల కాకపోవడంతో  పనులు ముందుకు సాగలేదు. దీంతో గతంలో నిర్మించిన కాల్వలు కూడా శిథిలమయ్యాయి.
 
 ‘ట్రయల్న్’్రతో చెరువుల్లోకి నీరు
 అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సింగూరు జలాలను సాగుకు అందించాలన్న ఉద్దేశంతో హడావుడిగా పనులు చేపట్టింది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 13న అప్పటి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఎడమ కాల్వ నుంచి నీటిని చెరువుల్లోకి పంపేందుకు ట్రయల్న్‌న్రు ప్రారంభించారు. అందోల్ చెరువులోకి నీరును తరలించేందుకు ప్రత్యేక చర్యల కారణంగా మార్గమధ్యలోని సుమారు 20 చెరువుల్లోకి నీరు చేరింది. ఎడమ కాల్వ నుంచి 0.15 టీఎంసీల నీటిని అప్పట్లో వదిలినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
 
 లిఫ్ట్ పనులు పూర్తయ్యేదెన్నడో
 లిఫ్ట్ ద్వారా సేద్యానికి నీరందించేందుకు గాను ప్రభుత్వం రూ.17 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.6 కోట్లు విడుదల చేసినట్లు సంబంధిత శాఖ డిప్యూటీ ఈఈ జగన్నాథం తెలిపారు. ఈ పథకానికి రాజనర్సింహ లిఫ్ట్ ఇరిగేషన్ అని నామకరణం చేశారు. ఈ పనులు పూర్తయితేనే నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు కాల్వల ద్వారా నీటిని అందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  
 
 మంత్రి హరీష్‌రావుపైనే ఆశలు
 ఏళ్లుగా సాగుతున్న సింగూరు పనులను వెంట నే పూర్తి చేస్తే 40 వేల ఎకరాలకు సాగు నీరందుతుందని, అందువల్ల జిల్లాకు చెందిన నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రైతులు కోరుతున్నారు. మంత్రికి జిల్లాపై పూర్తి అవగాహన ఉన్నందున తప్పనిసరిగా సింగూరు కాల్వల నిర్మాణం ప నులు పూర్తి అవుతాయని వారు ఆశాభావం వ్య క్తం చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై నీటి పారుదల శాఖ ఉన్నత అధికారులతో ఈనెల 21వ తేదీన సింగూరులో విసృ్తత స్థాయి సమావేశాన్ని మంత్రి టి.హరీష్‌రావు ఏర్పాటు చేయడంతో రైతులంతా గంపెడాశలతో శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా