ఆదివాసులను ఆగం చేయొద్దు

30 Jun, 2014 03:07 IST|Sakshi
ఆదివాసులను ఆగం చేయొద్దు

కల్వకుర్తి : ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజల మనోభావాలను గౌరవించి పరి పాలన సాగించాలని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి ఆదివాసీ గిరిజనులను ఆగం చేయడానికి కుట్ర పన్నిందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు.
 
 పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని టీఎన్‌జీఓ భవనంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావే శానికి కోదండరాంతోపాటు ప్రొఫెసర్ హరగోపాల్‌లు అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రకృతి ఒడిలో ప్రజలను ఆహ్లాదపరుస్తున్న పాపికొండలు, అటవీ ప్రాంతం ప్రాజెక్టు నిర్మాణంతో కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ నిర్మించి నా 100కు గరిష్టంగా 5 నుంచి 10 ఎకరాల వరకు నష్టం వాటిల్లుతుందని, ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 22 శాతం నష్టం జరుగుతుందన్నారు. అభివృద్ధి పేరుతో ఆదివాసులను, నిరుపేదలను అణిచివేసే కుట్ర జరుగుతోందని కోదండరాం విమర్శించారు.
 
 ప్రజలు ఉద్యమించాలి  
 పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు, నాయకులు పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని, ఈ సమస్యపై దేశవ్యాప్త చర్చ జరగాలని ప్రొ.హరగోపాల్ అభిప్రాయపడ్డారు. అమాయకులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడానికి అందరు ఒక్కతాటిపైకి వస్తేనే సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రకృతి ప్రళ యం వస్తే ఖమ్మం జిల్లాలోని ప్రజలతో పా టు, ఆంధ్ర ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు హాని కల్గిస్తుందన్నారు.
 
 విడిపోయినా ఉమ్మడి విధానాలా.?
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినా అనేక అంశాల్లో ఉమ్మడి విధానాన్ని కొనసాగించడం దుర్మార్గమని తెలంగాణ ఇంజనీయర్ల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ దేశ్‌పాండే విమర్శించారు. ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, హైకోర్టు, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్లను వేర్వేరుగా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
 
 న్యాయం జరిగేవరకు పోరాటం
 పోలవరం బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని పాల మూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి స్పష్టం చేశారు. తమ సంఘం కేవలం జిల్లాకే పరిమితం కాద ని, తెలంగాణలోని 10 జిల్లాల్లో ఎక్కడ సమస్య తలెత్తినా పోరాటాలు చేయడానికి ముందుంటుందన్నారు. చుండూరు బాధితులకు న్యాయం జరగాల్సి ఉంద ని, వారి పోరాటానికి తమ మద్దతుం టుందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, న్యాయవాదులు వెంకట్‌గౌడ్, రాంగోపాల్, రమేష్‌గౌడ్, జేఏసీ తాలూకా చైర్మన్ జంగయ్య, కన్వీనర్ సదానంద్‌గౌడ్, టీఎన్‌జీవో తాలూ కా అధ్యక్షుడు బావండ్ల వెంకటేష్, ఆమన్‌గల్, వెల్దండ జేఏసీ నాయకులు, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకలు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు