హైదరాబాద్‌లో భారీ వర్షం

2 Jul, 2020 21:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని పలుచోట్ల గురువారం రాత్రి భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలుచోట్ల రోడ్లు కూడా చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల నాలాలు పొంగిపోర్లడంతో.. బస్తీల్లోకి నీళ్లు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. 

మరిన్ని వార్తలు