జానీ మాస్టర్‌కు స్పెషల్‌ బర్త్‌ డే విషెస్‌

2 Jul, 2020 21:25 IST|Sakshi

ప్రముఖ టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు, మెగా ఫ్యామిలీ హీరోలకు మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లతో పాటు పలువురు మెగా హీరోల చిత్రాల్లోని హిట్‌ సాంగ్‌లకు జానీ కొరియోగ్రఫీ అందించారు. తాజాగా జానీ మాస్టర్‌ బర్త్‌ డే సందర్భంగా చిరంజీవి, రామ్‌చరణ్‌లు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు చిరంజీవి బర్త్‌ డే విషెస్‌ తెలుపుతూ పంపిన ఆడియో సందేశాన్ని జానీ మాస్టర్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘బాస్‌ మీ వాయిస్‌ గుర్తుపట్టలేని వాళ్లు ఉంటారా.. థాంక్యూ మెగాస్టార్‌ చిరంజీవి సార్‌. ఇది నా జీవితంలోనే బెస్ట్‌ మెమొరీ. మీ ఆశీస్సులకు, మద్దతుకు ధన్యవాదాలు సార్‌’ అని పేర్కొన్నారు.

అలాగే రామ్‌చరణ్‌ పంపిన వీడియో సందేశాన్ని కూడా ఆయన పోస్ట్‌ చేశారు. ‘థాంక్యూ వెరీ మచ్ రామ్‌ చరణ్‌ అన్నా. మీతో కలిసి పని చేసిన మొదటి రోజు నుంచి మీరు నాపై చూపించే ప్రేమ, నాకు ఇచ్చే సపోర్టుకు ఎప్పటికీ కృతజ్ఞతలు అన్నా’ అని రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు