రోడ్లపై ‘నిధుల వరద’

28 Nov, 2014 03:07 IST|Sakshi

వరంగల్ రూరల్ : జిల్లాలోని రహదారులు, భవనాల శాఖకు నిధుల వరద తాకింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు ఉన్న సింగిల్ రోడ్లను డబుల్ లేన్ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు  తెలంగాణ ప్రభుత్వం జిల్లాకు రూ.453.35 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 24 సింగిల్ రోడ్లను డబుల్ లేన్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.281.05 కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు ఉన్న 13 సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.172.30 కోట్లు కేటాయించింది. ఈ రోడ్ల మధ్యలో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

డబుల్‌గా మారనున్న సింగిల్ రోడ్లు...
ఊకల్ నుంచి తొర్రూరు రోడ్డు 9/0 నుంచి 53/0 కి.మీ వరకు రూ.45 కోట్లు
జంగిలిగొండ నుంచి నర్సింహులపేట రోడ్డు 0/0నుంచి 15/0 కి.మీ వరకు రూ.15కోట్లు
పరకాల నుంచి ఎర్రగట్టుగుట్ట వరకు 2/0నుంచి 14/4 కి.మీ వరకు రూ.15కోట్లు
పెద్దపెండ్యాల నుంచి పున్నేలు రోడ్డు 0/0నుంచి 13/0 కి.మీ వరకు రూ.15కోట్లు
ఘనపూర్ నుంచి వర్థన్నపేట రోడు 13/8నుంచి 17/3 కి. మీ వరకు రూ.4కోట్లు
పురుషోత్తమాయగూడేం నుంచి ఎల్లంపేట 0/0నుంచి 14/450కి.మీ వరకు రూ. 14కోట్లు
సిర్సేడు నుంచి మొగుళ్లపల్లి 2/0నుంచి 13/0 కి.మీ వరకు రూ.12కోట్లు
ములుగు-బుద్దారం రోడ్డు 1/0నుంచి 16/2 కి. మీ వరకు రూ.15కోట్లు
రేగొండ నుంచి జాకారం వరకు 0/0 నుంచి 17/866 కి.మీ వరకు రూ.20కోట్లు
నర్సింహులపేట నుంచి ఉగ్గంపల్లి వరకు 0/0నుంచి 7/0 కి.మీ వరకు 7కోట్లు
ఆలేరు బచ్చన్నపేట రోడ్డు 6/475నుంచి 17/070 కి.మీ వరకు రూ.14కోట్లు
డోర్నకల్ నుంచి సీతారాంపురం 0/0నుంచి 9/0 కి.మీ వరకు రూ. 10కోట్లు
కాజీపేట నుంచి ఉనికిచర్ల 3/2నుంచి 6/0 కి.మీ వరకు రూ.3కోట్లు
మొండ్రాయి పాలకుర్తి 12/0నుంచి 16/8 కి.మీ వరకు రూ. 5కోట్లు
వర్థన్నపేట నుంచి అన్నారం 0/0నుంచి 10/0 కి.మీ వరకు రూ.12కోట్లు
చేర్యాల నుంచి సల్వాపూర్ -యాదగిరిగుట్ట 0/0నుంచి 20/6 కి.మీ వరకు రూ.20కోట్లు
పిడబ్ల్యూడీ రోడ్ నుంచి పర్వతగిరి వయా వడ్లకొండ 12/5నుంచి 14/660 కి.మీ వరకు రూ.2.50కోట్లు
కురవీ నుంచి ఎల్లందు ఎక్స్‌రోడ్ 0/0నుంచి 2/660 కి.మీ వరకు రూ.3కోట్లు
పోతన కళామందిర్ 0/0నుంచి 1/675, చింతల్ నుంచి ఖమ్మం రోడ్ వయా ఫోర్ట్‌వరంగల్ 1/0నుంచి 3/4వరకు రూ.6కోట్లు
హన్మకొండ- నర్సంపేట-మహబూబాబాద్ 7/0నుంచి 8/0 కి.మీ వరకు 2.75కోట్లు
వెంకటాపూర్ బ్రాంచ్ రోడు 0/0నుంచి 1/4 వరకు రూ.2.80కోట్లు
కందికొండ  నుంచి చిన్నగూడూరు 0/0నుంచి 14/100 కి.మీ వరకు రూ.18కోట్లు
గిరిపురం నుంచి ఎల్లంపేట 0/0నుంచి 6/0వరకు రూ.10కోట్లు
మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే...
శాయంపేట మండలంలో... ఆత్మకూరు టు శాయంపేట 0/0 నుంచి 5/0 కి.మీ వరకు రూ.6కోట్లు
నెక్కొండ నుంచి ఇనుగుర్తి వరకు 1/0నుంచి 3/0 వరకు చింత నెక్కొండ 23/2 నుంచి 27/960 కి.మీ వరకు రూ.8కోట్లు
ధర్మసాగర్‌మడికొండ నుంచి ధర్మసాగర్ వరకు 0/0 -6/240 కి.మీ వరకు రూ.7.50కోట్లు
సంగెం మండలంలోని ఊకల్ నుంచి తొర్రూరు వరకు 0/0 నుంచి 9/0వరకు రూ.10.80కోట్లు
పాలకుర్తి మండలంలోని స్టేషన్‌ఘనపూర్ నుంచి పాలకుర్తి 3/0నుంచి 14/0వరకురూ.13050కోట్లు
జఫర్‌గడ్ మండలంలోని స్టేషన్‌ఘనపూర్ నుంచి జఫర్‌గఢ్ వరకు 0/0నుంచి 9/50వరకు రూ.11.50కోట్లు
పర్వతగిరి మండలంలో పీడబ్ల్యూడీ రోడ్ నుంచి ఉప్పరపల్లి వయా వడ్లకొండ వరకు 7/0నుంచి 14/661వరకు రూ.9.50కోట్లు
కొడకండ్ల మండలంలో ఎలచల్ కొడకండ్ల రోడ్డుకు 0/0నుంచి 4/030 వరకు రూ.5కోట్లు
తొర్రూరు నుంచి వలిగొండ రోడ్డు 9/3 నుంచి 7/50 కి.మీ వరకు రూ.15
కొత్తగూడ మండలం...ఎల్లందు పాఖాల్ 4/8 నుంచి 5/91 కి. మీ వరకుర రూ.13.50కోట్లు
దుగ్గొండి మండలంలో మహ్మద్ గౌస్‌పల్లి నుంచి గిర్నిబావి రోడ్ వయా నందిగామ-దుగ్గొండ 0/0నుంచి 11/00 వరకు 13.30కోట్లు
మద్దూరు మండలంలో.. మర్రిముచ్యాల నంచి వడ్లకొండ 7కిమీ (మద్దురు)జనగామ హుస్నాబాద్ 27కిమీవరకు(తరిగొప్పుల) రూ.23కోట్లు
నర్మెట్ట మండలంలో... రఘునాథపల్లి నుంచి నర్మెట్ట రోడ్డు 0/0 నుంచి 22/3వరకు రూ.27కోట్లు
లింగాలఘనపూర్ మండలంలో.. జనగామ సూర్యాపేట ఎక్స్‌రోడ్ 4/2నుంచి నెల్లుట్ల-బండ్లగూడేం రోడ్డు 0/0 నుంచి 7/2 వరకు రూ.8.70 కోట్లు

మరిన్ని వార్తలు