చెవిమోతలో గ్రేటర్‌ ఫైవ్‌

19 Jul, 2019 08:22 IST|Sakshi

నగరంలో అన్ని చోట్లా సౌండ్‌ పొల్యూషన్‌.. దేశంలోనే 5వ స్థానం

సాక్షి, హైదరాబాద్‌ : అబ్బా.. సౌండ్‌ పొల్యూషన్‌.. రోడ్డెక్కితే రోజూ మనం అనుకునేది ఇదే.. డొక్కు వాహనాల శబ్దాలు, నిర్మాణ సంబంధ యంత్రాల రణగొణ ధ్వనులు, పరిశ్రమల్లోని భారీ యంత్ర పరికరాల చప్పుళ్లు, ట్రాఫిక్‌జాంలో హారన్ల మోతలు.. ఇలా రకరకాల కారణాలతో మొత్తమ్మీద సిటీ గూబ గుయ్యిమంటోంది.  ఇళ్లు, పరిశ్రమలు, వాణిజ్య ప్రాంతాలు అన్న తేడా లేదు.. అన్నింటా బ్యాండ్‌ బాజాయే.. నిజానికి ప్రతి దానికీ ఒక లిమిట్‌ ఉండాలి. అలాగే ఈ శబ్ద కాలుష్యానికి కూడా.. వాస్తవానికి ఆ పరిమితి ఎంత? నగరంలో దాన్ని మించి ఎంత ఉంది అన్న లెక్కలను పరిశీలిస్తే.. నివాస ప్రాంతాల్లో పగటిపూట 55 డెసిబుల్స్, వాణిజ్య ప్రాంతాల్లో 65, పారిశ్రామిక ప్రాంతాల్లో, 75 డెసిబుల్స్‌ శబ్ద అవధిని మించరాదు. నివాస ప్రాంతాల్లో రాత్రి వేళల్లో 45, వాణిజ్య ప్రాంతాల్లో 55, పారిశ్రామిక ప్రాంతాల్లో 70 డెసిబుల్స్‌ మించరాదు. కానీ గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం 70 నుంచి 90 డెసిబుల్స్‌..రాత్రి వేళల్లో సరాసరిన 65–75 డెసిబుల్స్‌ మేర శబ్దాలు వెలువడుతున్నాయి. ఇక దేశంలోని పరిస్థితి లెక్కేస్తే.. లక్నో తొలిస్థానంలో నిలవగా..రెండో స్థానంలో కోల్‌కతా, మూడోస్థానంలో ఢిల్లీ, నాలుగో స్థానంలో ముంబై, ఐదో స్థానంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లు నిలిచినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక వెల్లడించింది.  

గ్రేటర్‌లో వివిధ ప్రాంతాల్లో శబ్దకాలుష్యం పరిస్థితి ఇదీ.. (డెసిబుల్స్‌లో)

మరిన్ని వార్తలు