-

సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

2 Jul, 2014 20:56 IST|Sakshi
జూనియర్ డాక్లర్లతో చర్చలు జరిపిన ఉప ముఖ్యమంత్రి రాజయ్య, హొ మంత్రి నాయని నరసింహారెడ్డి

హైదరాబాద్: గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. వారితో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. వారు తక్షణం విధులకు హాజరవుతారు. ఆస్పత్రులలో ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ వారికి హామీ ఇచ్చింది.  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులలో 50 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని చెప్పారు. డాక్టర్లకు రక్షణగా స్పెషల్ ప్రొటెక్షన్‌ ఫోర్సును నియమిస్తామన్నారు. జూనియర్ డాక్టర్లపై జరిగిన దాడికి సంబంధించి  నలుగురిని  అరెస్ట్ చేసినట్లు రాజయ్య తెలిపారు.

హోంమంత్రి నాయిని  నరసింహా రెడ్డి డాక్టర్లపై జరిగిన దాడిని ఖండించారు.  ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రులను మెరుగుపరుస్తామని చెప్పారు. సామాన్యులకు కార్పొరేట్ వైద్యం అందించడమే తమ లక్ష్యం అన్నారు.

మరిన్ని వార్తలు