పోటీ పరీక్షలకు ప్రత్యేకం

5 Sep, 2015 02:53 IST|Sakshi
పోటీ పరీక్షలకు ప్రత్యేకం

తెలుగులో తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే
అందుబాటులోకి తెచ్చిన ప్రణాళిక విభాగం
పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం
 సాక్షి, హైదరాబాద్: తొలిసారిగా రాష్ట్ర ఆర్థిక సామాజిక సర్వేను ప్రణాళిక విభాగం తెలుగులో ప్రచురించింది. ‘బంగారు తెలంగాణ దిశగా తొలి అడుగులు-తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం-2015’ పేరుతో ఈ పుస్తకాన్ని  అందుబాటులోకి తెచ్చింది. సీఎం కేసీఆర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార, ప్రజా సంబంధాల కమిషనర్ బీపీ ఆచార్య శుక్రవారం ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి సంబంధించి వివిధ రంగాల వారీగా సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. వ్యవసాయ రంగం, సంక్షే మం, సామాజిక అభివృద్ధి, ఆర్థిక, మౌలిక సదుపాయాలు, నూతన పారిశ్రామిక విధానం, విశ్వనగరంగా హైదరాబాద్, గణాంకాల్లో తెలంగాణ.. తదితర అంశాలు ఇందులో ఉన్నాయి.

రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను పుస్తకంలో సమగ్రంగా విశ్లేషించారు. అభ్యర్థులు పుస్తకాలను కొనుగోలు చేసేందుకు వీలుగా.. జిల్లా కేంద్రాల్లో ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయాల్లో, హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లోని డెరైక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కార్యాలయంలో కాపీలను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేటు పబ్లిషర్స్‌కు ఇవ్వకుండా ప్రభుత్వమే దీని కాపీరైట్స్ తీసుకుంది. పుస్తకం ధర రూ.250గా నిర్ణయించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి ఈ పుస్తకం ప్రతిని పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.

మరిన్ని వార్తలు