స్వీటీతో కేటీఆర్‌..

4 Apr, 2018 19:42 IST|Sakshi

వరంగల్‌: జిల్లాల పర్యటనలో భాగంగా తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖా మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు(కేటీఆర్‌) బుధవారం వరంగల్‌ పట్టణానికి విచ్చేశారు. కుడా కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో చోటుచేసుకున్న ఒక దృశ్యాన్ని ‘ఫేవరెట్‌ పిక్‌ ఆఫ్‌ది డే’ గా అభివర్ణిస్తూ మంత్రి కేటీఆర్‌ ఒక ట్వీట్‌ చేశారు.

స్వీటీతో షేక్‌హ్యాండ్‌: సమీక్షా సమావేశానికి వచ్చిన జిల్లా పోలీసు అధికారులు కూడా స్వీటీ అనే జాగిలాన్ని కూడా తీసుకొచ్చారు. సుశిక్షితురాలైన స్వీటీ.. ఎంచక్కా ముందరికాళ్లను పైకెత్తి మంత్రిగారికి విష్‌ చెప్పి అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. ప్రతిగా కేటీఆర్‌ సైతం స్వీటీకి షేక్‌హ్యాడ్‌ ఇచ్చారు. సంబంధిత ఫొటోలను ట్విటర్‌లో షేర్‌చేసిన కేటీఆర్‌.. వాటిని ఫేవరెట్‌ పిక్‌ ఆఫ్‌ ది డేగా పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు