పునరావాసం తర్వాతే భూసేకరణ

7 Jun, 2018 05:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూసేకరణ వల్ల నష్టపోయే రైతు కూలీలు, చేతివృత్తులవారికి నూతన భూసేకరణ చట్టం–2013 ప్రకారం ఉపాధి, పునరావా సం కల్పించాకే సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కృష్ణాపూర్, వేములఘాట్‌ల్లో భూసేకరణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. జీవో 123 ప్రకారం మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు అవసరమైన భూముల్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, అయితే వాటిపై ఆధారపడినవారికి పునరావాసం కల్పించలేదని గతంలో దాఖలైన రెండు వేర్వేరు వ్యాజ్యాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచందర్‌రావు బుధవారం మధ్యంతర ఆదేశాలిచ్చారు. ఏటిగడ్డ కృష్ణాపూర్‌ గ్రామ రైతు కూలీలు 93 మంది, వేములఘాట్‌ గ్రామంలోని 20 మంది రైతు కూలీలు వేసిన వ్యాజ్యాల్లో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు