ఉస్మానియాలో రిపోర్టుల తారుమారు!

18 Jul, 2020 03:25 IST|Sakshi

నిమోనియాతో వెళితే కరోనా అన్నారు

ప్రైవేటులో పరీక్ష చేయిస్తే నెగెటివ్‌ వచ్చింది..

బషీరాబాద్‌: అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన ఓ యువకుడికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిం దని వైద్యులు చెప్పడంతో కుప్పకూలిపోయా డు. అనుమానం వచ్చి ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో కోవిడ్‌ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌గా తెలిం ది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం కొత్లాపూర్‌ గ్రామానికి చెందిన మేఘనాథ్‌ గౌడ్‌ విద్యావాలంటీర్‌. ఈ నెల 3న అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అతడికి వైద్యులు కరోనా పరీక్ష చేయగా.. ఈ నెల 7న రిపోర్టులో పాజిటివ్‌ అని తేలింది.

దీంతో బాధితుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రిపోర్టులో ఫోన్‌ నంబర్, ఇంటి పేరు తప్పు గా ఉండటంతో అనుమానం వచ్చి నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా కరోనా నెగెటివ్‌గా తేలింది. అతడికి కరోనా లేదని, నిమోనియా తో బాధపడుతున్నారని అక్కడి వైద్యులు తెలి పారు. ఇదే విషయమై ఉస్మానియా వైద్యులను కుటుంబసభ్యులు నిలదీయగా పొరపాటున  తారుమారయ్యాయని  చెప్పి చేతులు దులుపుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన తమ్ముడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, సమయానికి చికిత్స అందక ఆరోగ్యం క్షీణించిందని, ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నామని,  రూ.11 లక్షలు ఖర్చయిందని, ఇంకా రూ.15 లక్షల వరకు అవుతుందని వైద్యులు చెప్పారన్నారు. దాతలు తమను ఆదుకోవాలని కోరారు.  

మరిన్ని వార్తలు