‘మెట్రో’ భద్రతకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్

11 Sep, 2014 03:47 IST|Sakshi
‘మెట్రో’ భద్రతకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్

సాక్షి,సిటీబ్యూరో: నగర మెట్రో ప్రాజె క్టు, స్టేషన్లు, ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్ ఏర్పాటుతో పా టు అదనపు సిబ్బందిని కేటాయిం చేం దుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూత్రప్రాయంగా అంగీకరించారు. బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ‘మెట్రో’ ప్ర యాణికుల భద్రతపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ... ఢిల్లీ, బెంగళూరు నగరాలకు భిన్నంగా నగర మెట్రో రైళ్లలో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అత్యాధునిక ప్రమాణాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో బ్యాగేజి స్కా నింగ్, సీసీటీవీలు, సెక్యూరిటీ అలారంలను ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఈ విషయంపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో  పాటు ఎల్‌అండ్‌టీ హెచ్‌ఎంఆర్ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెట్రో స్టేషన్ల సమీపంలోని పార్కింగ్ కేంద్రాలు, వయాడక్ట్, ట్రాక్, డిపోల్లోనూ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయనున్నామన్నారు.
 
ఉగ్రపంజా నేపథ్యంలో..

నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ, కౌంటర్ టైజం నిపుణుల పర్యవేక్షణలో నగర మెట్రో స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. సమగ్ర భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విషయంలో త్వరలో స్పష్టత రానుందన్నారు.  సమావేశంలో అదనపు కమిషనర్ సందీప్ శాండిల్య, అంజనీ కుమార్, గంగాధర్, ఎల్‌అండ్ టీ ప్రాజెక్టు డెరైక్టర్ ఎంపీ నాయుడు, అనిల్‌కుమార్ సైనీ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు