శాసన మండలిలో తీవ్ర గందరగోళం

28 Nov, 2014 11:09 IST|Sakshi
శాసన మండలిలో తీవ్ర గందరగోళం

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలో గురువారం తీవ్ర గందరగోళం నెలకొంది. ఆగంతుక నిధి పెంచాలని విపక్షాలు కాంగ్రెస్, టీడీపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో సభలో విపక్షాలు నిరసనకు దిగాయి. అయితే అధికార పక్షం మాత్రం ఇవేమీ పట్టించుకోక పోవడం.... ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు.

దాంతో ఛైర్మన్ పోడియం ముందు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దాంతో శాసనమండలిని ఛైర్మన్ ఆరగంట పాటు వాయిదా వేశారు.   తెలంగాణ శాసనసభ, మండలిలో ద్రవ్య వినిమయ బిల్లును గురువారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు