బహిష్కరణను నిరసిస్తూ ఆందోళన

14 Jul, 2018 10:58 IST|Sakshi
ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు

యైటింక్లయిన్‌కాలనీ: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్‌ నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ శుక్రవారం యైటింక్లయిన్‌కాలనీలో విశ్వహిందూ పరిషత్, హనుమాన్‌దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్థానిక తెలంగాణ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. హిందువులకు వ్యతిరేకంగా కొన్ని చానళ్లు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బీజేపీ, ఆలయ కమిటీ సభ్యులు గోవర్ధనగిరి మధుసూధనాచార్యులు, సౌమిత్రి హేమంతాచార్యులు, శుక్లాచారి, బండారి రాయమల్లు, శ్రీనివాస్, ముత్యాల బాలయ్య, పోతు శంకరయ్య, సత్యనారాయణరెడ్డి, మూకిరి రాజు, శశికుమార్, బెల్లంకొండ భాస్కర్‌రెడ్డి, పోతు రాకేశ్, కుమార్, మారెపల్లి శ్రీనివాస్, భగవాన్‌రెడ్డి, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 
భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ   
గోదావరిఖనిటౌన్‌ : స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్‌ నగర బహిష్కరణ చేసిందుకు నిరసగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌ నాయకులు శుక్రవారం భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక స్వాతంత్య్ర చౌక్‌ నుంచి గణేశ్‌ చౌక్‌ వరకు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. హిందుత్వం, ఆలయాలు, పూజల కోసం తపించే కేసీఆర్‌ ప్రభుత్వం స్వామి పరిపూర్ణానందను ఎందుకు నగర బహిష్కరణ చేశారని ప్రశ్నించారు.

హిందూ సమాజం కోసం నిరంతరం ఆకాంక్షించే స్వామిని నగర బహిష్కరణ చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్వామిజీని నగరంలోని తీసుకురావాలని వారు కోరారు. అంతకుముందు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు వేపూరి రాములు గౌడ్, అయోధ్య రవీందర్, అడిగొప్పల రాజు, గుడికందుల ఆకాశ్‌ కుమార్, ముష్కె సంపత్, సుధీర్, శశికాంత్, చక్రపాణి, జిమ్‌ సమ్మన్న, సతీశ్, అనిల్, నరేశ్, అనిరుద్, అజేయ్, పెండ్యా మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు