శాంతిభద్రతల కోసమే కార్డెన్‌సెర్చ్‌

21 Dec, 2018 09:01 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు, వాహనాల పత్రాలు పరిశీలిస్తున్న పోలీసులు

జడ్చర్ల టౌన్‌: బాదేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మబావిగడ్డ, ఫజల్‌బండ, నిమ్మబావిగడ్డతండాలో గురువారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్‌ డీఎస్పీ భాస్కర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తెల్లవారుజామున ఉన్నట్టుండి పోలీసులు తలుపుతట్టి పోలీస్‌.. అనడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తర్వాత కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారని తెలుసుకుని కుదుటపడ్డారు. ఉదయం 5గంటల నుంచి పోలీసులు ఇంటింటిని సోదాచేశారు.

సెర్చ్‌లో డీఎస్పీతోపాటు నలుగురు సీఐలు, 10మంది ఎస్‌ఐలు, స్పెషల్‌పార్టీకి చెందిన 100మంది పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి ఇంటింటిని తనిఖీ  చేశారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 39 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 9ఆటోలు, 5 కార్లు, 3ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటి పత్రాలను చూసి కొన్నింటిని వదిలిపెట్టారు. ఇదిలాఉండగా అదే ప్రాంతంలో ఉన్న ఇద్దరు పాత నేరస్తులైన లక్ష్మయ్య, మహమూద్‌లను విచారించారు. తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి.

ప్రజల రక్షణకే..
ప్రజల రక్షణ కోసమే ఎస్పీ ఆదేశాల మేరకు కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించామని డీఎస్పీ భాస్కర్‌గౌడ్‌ తెలిపారు. భద్రత విషయంలో పూర్తిహామీ ఇచ్చేందుకు ఇలాంటి కార్డెన్‌ సెర్చ్‌లు ఉపయోగపడతాయని, ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకే సోదాలు నిర్వహించామని చెప్పారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 39 ద్విచక్రవాహనాలు, 9 ఆటోలు, 5కార్లు, 3ట్రాక్టర్లను స్వాధీనపర్చుకున్నామన్నారు. కార్డెన్‌సెర్చ్‌లో సీఐలు బాల్‌రాజ్‌యాదవ్, రవీందర్‌రెడ్డి, పాండురంగారెడ్డి, ఎస్‌ఐలు కృష్ణయ్య, మధుసూదన్‌గౌడ్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

జమ్మిచేడులో  
గద్వాల రూరల్‌: మండలంలోని జమ్మిచేడులో గు రువారం ఉదయం ఏఎస్పీ కృష్ణ ఆధ్వర్యంలో పో లీసులు కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భం గా పలు వార్డుల్లో పొద్దున్నే పోలీసులు సంచరిస్తూ అనుమానితుల కోసం నిఘా పెట్టారు. అనుమ తులు లేని 36 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చే సుకున్నారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో జీవించాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టామని ఏఎస్పీ తెలిపారు. ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరిగినా ప్రజలు నిర్భయంగా పోలీసులకు సమాచారం చేరవేయాలని కోరారు. కార్డెన్‌సెర్చ్‌లో ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు, 60 మంది పోలీసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు