చండూరు: ఎట్టకేలకు మూడోకన్ను

6 Dec, 2018 11:47 IST|Sakshi
చండూరు సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు

 చండూరులో ఏర్పాటుచేసిన  సీసీ కెమెరాలు

 అదుపుకానున్న నేరాలు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు 

సాక్షి, చండూరు : చండూరు మున్సిపాలిటీ కేంద్రం ఎట్టకేలకు మూడో కన్ను తెరిచింది. దొంగతనాలకు, అరాచకాలకు ఇక చెక్‌ పడనుంది. ప్రతి చిన్న సంఘటనను సైతం ఇట్టే గుర్తుపట్టే అవకాశం ఉంది. గతంలో సీసీ కెమెరాలు లేక పోవడంతో పట్టణంలో అనేక చోరీలు చోటు చేసుకున్నాయి. పోలీసుల చొరవతో సీసీ కెమెరాలను పట్టణంలో ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేశారు. దీంతో ఇక ముందు చోరీలు ఉండవని, ఒక వేళ జరిగినా ఇట్టే గుర్తించే అవకాశం ఉందని పోలీసులు చెపుతున్నారు. 
పట్టణంలో...
బోడంగిపర్తి గ్రామానికి చెందిన మంచికంటి ట్రస్ట్‌ అందించిన 12 కెమెరాలను బిగించారు. పట్టణంలో ముఖ్య కూడలి సెంటర్‌లో నాలుగు, ఎస్‌బీఐ ఏరియాలో రెండు, మరో ఆరు కెమెరాలను జనం రద్దీగా ఉండే స్థలాలో బిగించారు. కెమెరాలతో పట్టణ ప్రజలు నిర్భయంగా ఉండే అవకాశం ఉంది. 
గతంలో ...
చండూరు పట్టణంలో గతంలో అనేక చోరీలు చోటుచేసుకున్నాయి. ప్రతి శుక్రవారం సంత రోజు ఒక్కటి, రెండు గొలుసు చోరీలు జరుగుతునే ఉండేవి. అనేక మంది మహిళలు సంతకు రావడానికి జంకే వారు. కొంత మంది రాత్రి సమయాలలో బయట తిరుగుతూ అలజడులు సృష్టించే వారు. దీంతో ప్రజలు రాత్రి అయ్యిందో బయటకు రావడానికి జంకే వారు. ఇక సీసీ కెమెరాల ఏర్పాటుతో ఆ భయం లేకుండా పోయింది.  

సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.. 
పట్టణంలో మంచికంటి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇక చోరీలకు చెక్‌ పడనుంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. సీసీ కెమెరాలతో ఇబ్బందులు తప్పనున్నాయి.
 
– సైదులు, ఎస్‌ఐ 

మరిన్ని వార్తలు